కరోనా వ్యాప్తిని నివారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. మంత్రులు, సంబంధిత అధికారుల సమన్వయంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా నియంత్రిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ గౌలిగూడలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది నిరుపేదలకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రి అభినందించారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.