ఇవీ చూడండి:తెరాస నేతలు రైతులను మభ్యపెడుతున్నారు: అర్వింద్
'వివరాలు తెలుసుకోకుండా తొందరపడ్డ సీఎం'
రైతు శరత్ భూసమస్యను లేవనెత్తి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు శరత్ విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు.
శరత్ భూ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలి : కోదండరెడ్డి
రైతు శరత్ భూసమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం చేయాలని చూశారని ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. క్షేత్ర స్థాయి వివరాలు తెలుసుకోకుండా సీఎం నుంచి కలెక్టర్ వరకు అంతా తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతుల సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు.శరత్ భూవిషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసమే రైతు బంధు వాడుకున్నారని...ఇప్పటికీ చాలా మందికి పెట్టుబడి సాయం అందలేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:తెరాస నేతలు రైతులను మభ్యపెడుతున్నారు: అర్వింద్
Last Updated : Mar 30, 2019, 10:31 AM IST