పీవీకి భారతరత్న పురస్కారం తీర్మానానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలని కొనియాడారు. ఆర్థిక పరిస్థితి గాడి తప్పినప్పుడు గుర్తుకొచ్చేది పీవీనేనని అన్నారు. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చింది పీవీనే అని స్పష్టం చేశారు.
లుక్ ఈస్ట్ విధానంతో పలు దేశాలతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పారని గుర్తు చేశారు. పీవీ హయాంలోనే ఎన్‌హెచ్‌ఆర్‌సీ, మహిళా కమిషన్ ఏర్పడ్డాయని అసెంబ్లీ సమావేశాల్లో భట్టి చెప్పారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్