రాజకీయాల కోసమే తెరాస, భాజపా నేతలు విమర్శలు చేసుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్కమార్క(bhatti vikramarka news in telugu) ఆరోపించారు. వీరి గేమ్‌లో ప్రజలు పావులు కావొద్దని అన్నారు. బండి సంజయ్ కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానంటే కేసీఆరేమో టచ్ చేసి చూడు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుట్‌బాల్ ఆడుతున్నాయని మండిపడ్డారు. యాసంగిలో వరి పండించవద్దని.. పండించినా తాము కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. ప్రభుత్వంలో అతిపెద్ద వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో తెలియదని మండిపడ్డారు.
యాసంగిలో వరి వేయద్దు. కేంద్రం కొనను అంటుంది కాబట్టి కొనను అంటే ఎలా? మీరేం చేస్తున్నారు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోలేదు? మీరేమో భాజపా వాళ్లమీద.. వాళ్లేమో మీ మీద విమర్శలు చేసుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి తెలంగాణ రైతులను ఫుట్‌బాల్ ఆడుతున్నారు. మీరిద్దరు కలిసి ఒకరినొకరు అనుకోవడం సరైంది కాదు. ప్రజలంతా ఇది గమనించాలి.
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
వరిని సాగు చేయడం రాష్ట్రంలో ఇదేమి మొదటిసారి కాదని భట్టి(bhatti vikramarka news in telugu) అన్నారు. పండిన ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో ప్రణాళికలు చేసేందుకే ప్రభుత్వం ఉందని... కేంద్రం కొనకకపోతే ప్రభుత్వం కొనుగోలు చేయదనడం సరికాదని హతవు పలికారు. 7 సంవత్సరాల నుంచి నదీజలాల సమస్య పరిష్కరించట్లేదని సీఎం కేసీఆర్ ఇప్పడు అంటున్నారని... మరి ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అనేకసార్లు దిల్లీ వెళ్లినా... నదీ జలాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేదని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం అప్పులు తీసుకొచ్చినా... ఇంకా అవి పూర్తి కాలేదని విమర్శించారు. పంట మార్పిడిపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావాలి. హుజూరాబాద్ ఓటమిపై అంతర్మథనం చేసుకుంటున్నాం. అంతర్గత పోరు వల్ల ఏ పార్టీ అయిన బలహీన పడుతుంది. మేము కూడా మా పార్టీలో అంతర్గత పోరు లేకుండా చూసుకుంటాం. పార్టీలో ఎవరిని ఎవరూ బలి చేయరు. పార్టీ నిర్ణయాలు ఉంటాయి కానీ వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు.
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చదవండి: Etela rajender land issues: మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం.. నోటీసులు జారీ