దేశ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్(CONGRESS) బలమైన పునాదులు వేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(BHATTI VIKRAMARKA) అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని భాజపా(BJP) చిన్నాభిన్నం చేస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల పేరిట భాజపా ప్రజలను విభజిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను సక్రమంగా అమలు చేయలేదని భట్టి అన్నారు. గత హామీలు నెరవేర్చకపోవడంతోనే దళితబంధుపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోసం వాడుకొని వదిలేస్తారనే అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. దళిత బంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Independence day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు