కరోనా వ్యాప్తి నిరోధానికి చేపట్టిన లాక్డౌన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పేదలకు రేషన్ అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అవసరమైన నిత్యావసరాలు ఇళ్లకే సరఫరా చేయాలని కోరారు. నగరాల్లో, పట్టణాల్లో... ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నందున అవసరమైన కూరగాయలు, ఇతరత్ర ఇళ్లకే చేరవేయాలని సూచించారు. శానిటైజర్లు, మాస్క్లు, గ్లౌజులు వాడమని నిపుణులు చెబుతున్నారని... వాటి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇవీచూడండి: కరోనా పంజా: భారత్లో 27కు చేరిన మరణాలు