లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్తు బిల్లులను విఫరీతంగా పెంచి పేదలపై ప్రభుత్వం మోయలేని భారం మోపిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. విద్యుత్తు బిల్లు, నియంత్రిత పంటలపై ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి అనుమతి అడిగామని... అందుకు గాను తమను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఒక ప్రజాప్రతినిధి హోదాలో సచివాలయానికి వెళ్లి వినతిపత్రం ఇవ్వడం తన హక్కుగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయడం తన ప్రధానవిధి అన్న ఆయన... అధికారికంగా ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం తనకున్న హక్కుగా పేర్కొన్నారు. ఇవాళ తనను అడ్డుకొని తన హక్కులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనను అవమానించారని ఆరోపించారు. తన హక్కులను, బాధ్యతలను అడ్డుకున్న వారిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తనకు న్యాయం జరగకపోతే న్యాయ పరంగా పోరాటం చేస్తానన్నారు.
ఇదీ చూడండి : 'అధిక విద్యుత్ చార్జీలు తెరాస వైఫల్యమే'