ETV Bharat / state

ప్రశాంతంగా మహాశోభాయాత్ర

పదకొండు రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్​లో మహాశోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. జీహెచ్‌ఎంసీ, పోలీసుల అధికారుల ముందస్తు వ్యూహంతో ఎటువంటి సమస్యలు లేకుండా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది తరలిరావడం వల్ల హుస్సేన్‌సాగర్‌ జనసంద్రమైంది.

వినాయక నిమజ్జనం
author img

By

Published : Sep 13, 2019, 5:26 AM IST

Updated : Sep 13, 2019, 5:41 AM IST

జంటనగరాల్లో వినాయక మహాశోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. వాడవాడలా కొలువైన గణనాథుల ప్రతిమలు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ బాట పట్టాయి. భక్తుల కోలాహలం, జై బోలో గణేశ్​ మహారాజ్‌కీ జై అంటూ కేరింతల మధ్య వినాయక నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌మార్గ్‌, నెక్లెస్‌ రోడ్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌ పరిసరాలు లక్షలాది మంది భక్తులతో జనసంద్రాన్ని తలపించాయి. నగరంలోని ప్రధాన చెరువుల వద్ద నిమజ్జన సందడి నెలకొంది.

1.45 నిమిషాలకు..

గత ఏడాదిలాగే ఖైరతాబాద్‌ మహాగణపతిని తొందరగా నిమజ్జనం చేశారు. మహాగణపతి శోభాయాత్ర గురువారం ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెంబరు 6 వద్దకు చేరుకుంది. 400 టన్నుల సామర్థ్యం ఉన్న భారీ క్రేన్‌ సాయంతో మహాగణపతిని 1.45 గంటల ప్రాంతంలో గంగమ్మ ఒడికి చేర్చారు. బాలాపూర్​ వినాయకుడిని సాయంత్రం 5 గంటలలోపే నిమజ్జనం చేశారు.

ఈ ఏడాది ఫిలింనగర్ వినాయకుడి లడ్డూ అత్యధికంగా రూ. 17.75 లక్షలు పలికి రికార్డులు బద్దలుకొట్టింది. బాలాపూర్ గణేశ్​ లడ్డూ రూ. 17.60 లక్షలు పలికింది.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బంది ప్రణాళిక రూపొందించారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనం సాగుతున్న తీరు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ద్వారా వీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జలమండలి, విద్యుత్తు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిమజ్జన తీరును సమీక్షించారు. డీజీపీ, సీపీతో కలిసి మంత్రులు మహమూద్​ అలీ, తలసాని వీక్షణం ద్వారా నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా అయ్యేలా చర్యలు తీసుకున్న అధికారులను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.

అక్కడక్కడ...

కిషన్‌బాగ్‌ ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు క్రేన్‌ ఢీకొనడం వల్ల రవీందర్‌ అనే పోలీసు కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్‌సాగర్‌ క్రేన్‌నెంబర్​ 10 వద్ద విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా... నలుగురు భక్తులు సాగర్‌లోకి జారిపోయారు. రంగంలోకి దిగిన విపత్తు నిర్వాహణ దళం తక్షణం స్పందించి వారిని రక్షించారు.

అర్ధరాత్రికి 40 వేల విగ్రహాలు..

జలమండలి 115 ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేసి 30 లక్షలకు పైగా మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేసింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తుల కోసం పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు అందించాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాగర్‌ చుట్టు నిమజ్జనం సాఫీగా జరిగేలా 32 ప్రాంతాల్లో 260 స్టాటిక్‌ క్రేన్‌లు ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రికి 40 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. అరకొర ఘటనలు మినహా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

ఇవీ చూడండి: బాలాపూర్​ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్​ లడ్డూ...!

Last Updated : Sep 13, 2019, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.