హైదరాబాద్ కూకట్‌పల్లిలో న్యాయస్థాన భవన, నివాస గృహ సముదాయాల నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి శంకుస్థాపన చేశారు. కూకట్‌పల్లి కోర్టు సొంత భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలో అద్దె భవనాలలో కొనసాగుతున్న న్యాయస్థానాలను సొంత భవనాలలోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని సీజే తెలిపారు. అద్దె భవనాలలో కోర్టు వచ్చే కక్షిదారులకు, న్యాయవాదులకు సరైన వసతులు కల్పించటం అన్ని చోట్ల వీలు పడటం లేదన్నారు.
కూకట్‌పల్లి కోర్టు న్యాయమూర్తుల నివాసం కోసం గృహ సముదాయం నిర్మించటం మంచి పరిణామమన్నారు. న్యాయమూర్తులు కోర్టులో మరింత సమయం కేటాయించే అవకాశం ఉందన్నారు. భవన నిర్మాణ ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్, అభిషేక్ రెడ్డి, జిల్లా న్యాయమూర్తులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: నేడు హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన