మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ... నిరాశ చెందలేదు. పట్టు వీడలేదు. పట్టుదలతో చదివారు. తాజాగా సివిల్స్ లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్ కు చెందిన ఎంవీ సత్యసాయి కార్తీక్.
హైదరాబాద్ అండర్ 19 జట్టులో క్రికెట్ లోనూ రాణించిన.. సత్య సాయి కార్తీక్ స్పష్టమైన లక్ష్యంతో.. సివిల్స్ ర్యాంకు సాధించి ఐఏఎస్ కాబోతున్నారు. మనతో మనమే పోటీ పడుతూ... లోపాలను విశ్లేషించుకుంటూ.. ప్రిపేర్ కావాలంటున్న సత్యసాయి కార్తీక్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.