రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల భవన్లో సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. కోటి వృక్షార్చనలో భాగంగా రాష్ట్రంలోని 15 ప్రధాన ఆలయాల్లో రైస్ మిల్లర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల ఆవరణాల్లో మొక్కలు నాటారు.
బాసర సరస్వతీదేవి, ఏడుపాయల వనదుర్గాభవాని, నాచారం లక్ష్మీ నరసింహస్వామి, జహీరాబాద్ శివాలయం, వికారాబాద్ అనంత పద్మనాభస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి, అలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళీ, యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి, కురవి వీరభద్రస్వామి, కొమురవెల్లి మల్లన్నస్వామి, మిట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి, భద్రాచలం రామయ్య, కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.