Civil Liberties Fires on NIA Raids in Telangana : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. అవినీతి నేతల బాగోతం బయటపడుతుందేమోనన్న భయంతో ప్రజా సంఘాల నాయకులపై ఎన్ఐఏతో(NIA Raids) దాడులు చేయిస్తున్నారని పౌరహక్కుల నేతలు విమర్శించారు. ఎన్ఐఏ దాడులకు నిరసనగా హైదర్‌గూడలో సమావేశం నిర్వహించారు. ఈ దాడుల్లో మోదీకి(PM Modi), ఏపీ సీఎం జగన్‌కి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి సంబంధం ఉందని ధ్వజమెత్తారు.
NIA Searches in Telugu States: ఎన్ఐఏ సోదాలతో ఉలిక్కి పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు..
Civilrights Proteters fires on NIA raids : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నాయకులకు వ్యతిరేకంగా తెలుగు ప్రజానీకం ఏకమైందని.. ప్రజా సంఘాలు తమను ఎండగడతాయి అనే ఉద్దేశంతోనే రాజకీయ నేతలు ఎన్ఐఏతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నెల క్రితం మెదక్‌లో పరీక్ష రాస్తున్న జయదేవ్ అనే వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఉండగానే ఎన్ఐఏ దాడులు చేస్తోంది అంటే.. కేవలం షో చేయడానికేనని పేర్కొన్నారు.
NIA Raids in Telugu States : ప్రజా సంఘాల నేతలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేయడమే ఈ దాడుల ముఖ్య లక్ష్యమని మండిపడ్డారు. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ దాడులు చేస్తోందని.. ఎన్నికల ముందు ఎక్కడికక్కడ ప్రజా సంఘాలను భయబ్రాంతులకు గురి చేసి.. బ్యాలెట్ బాక్సులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
Telangana State Civil Liberties Committee : మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో.. కవులు, రచయితలు, ప్రజా సంఘాల నేతలపై ఆకస్మిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులుగా లేని అనుమానం.. ఎన్నికల ముందే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఉఫా చట్టం పేరుతో హింసిస్తున్నారని.. ఈ చట్టాన్ని తొలగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ.. దానినే వాడుకుని ఎన్ఐఏ అక్రమ దాడులకు పాల్పడుతోందన్నారు.
నిషేధిత వస్తువులు, పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు తీసుకొచ్చి.. ఇంట్లో పెట్టి, ఫోటోలు, వీడియోలు తీసి అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని తీసుకెళ్లి జైళ్లలో పెడుతున్నారన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు కొందరు తమ ఇంటి గోడ దూకి కొందరు ఇంట్లోకి వచ్చారని.. తన భార్య ఆత్మకూరు భవాని పేరుతో సెర్చ్ వారెంట్ ఇచ్చారని బాధితుడు కృష్ణ తెలిపారు.
"మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఎన్ఐఏ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. ఈ దాడులు పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ దాడుల వెనుక రాజకీయ నేతల హస్తం ఉంది. ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తున్నారు". - నారాయణరావు, పౌర హక్కుల నేత
Varalaxmi Sarathkumar Drugs : నటి వరలక్ష్మికి ఎన్ఐఏ నోటీసులు!.. క్లారిటీ ఇదిగో..
NIA Raids in Karimnagar Today : కరీంనగర్‌లో NIA అధికారుల సోదాలు.. అతడి కోసం గాలింపు..!