జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో జరుగుతున్న పలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఖైరాతాబాద్ జోన్‌లోని గుడిమల్కాపూర్ డివిజన్, సంతోష్ నగర్ కాలనీలో చెత్తను చూసి స్థానిక అధికారులను మందలించి... వెంటనే చెత్తను తీసివేయాలని హెచ్చరించారు.
రెడ్ హీల్స్ డివిజన్లోని మొఘల్ ఖానా నాలా వద్ద చెత్తను చూసి వెంటనే అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు చెప్పి తీయించారు. రామ్ సింగ్ పూరలో జనాలు రోడ్డు మీద చెత్త వేయడం చూసి వారికి అలా వేయవద్దని అవగాహన కల్పించారు. జియగూడలోని డంపింగ్ యార్డ్‌లో రాంకీ ప్లాంట్ పనిచేయకాపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండడం చూసి అసహనానికి గురైన మేయర్ వారిని వెంటనే మరమ్మతులు చేసి పనిని ప్రారభించాలని చెప్పారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలోని రోడ్డు మీద ఒక కిలో మీటర్ వరకు చెత్త ఉండడం చూసి మేయర్ కంగుతిన్నారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను పిలిపించి వెంటనే తీయించాలని ఆదేశించారు. ఖైరతబాద్ జోన్లో చాలా చోట్ల చెత్త నిల్వ ఉందని వెంటనే వాటి మొత్తాన్ని తీపించాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో ఎక్కడ కూడా చెత్త నిల్వలు కనపడ వద్దని మేయర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: శ్రీమంతులు కాకపోయినా.. ఆకలి తీరుస్తున్న దాతలు