ETV Bharat / state

ఆర్టీసీ ఆదాయ మార్గం.. రద్దీకనుగుణంగా నగర సర్వీసుల పెంపు

ఆర్టీసీ ప్రయాణం గాడిన పడుతోంది. సిటీ బస్సుల్లో ప్రయాణికులు పెరుగుతున్నారు. దీంతో ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా వేళ ఆదిలో కాస్త వెనుకడుగు వేసినా.. అందరికీ అందుబాటులో ఉన్న బస్సుల వైపు నగర ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు.

Telangana rtc income
తెలంగాణ ఆర్టీసీ ఆదాయ మార్గం
author img

By

Published : Oct 30, 2020, 10:35 AM IST

ఆరు నెలల తర్వాత సెప్టెంబరు 25న ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆదిలో 18 నుంచి 20 శాతం మంది మాత్రమే ప్రయాణిస్తే.. ఇప్పుడు 45 నుంచి 50 శాతం సీట్లు నిండుతున్నాయి. దీంతో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ రోజువారీ రాబడి రూ.కోటి దాటింది. ఆదివారం, సెలవు రోజుల్లో కొంత తగ్గుతున్నా.. మిగతా రోజుల్లో రూ.1.20 లక్షల వరకూ ప్రయాణికుల ద్వారా రాబడి వస్తోందని గ్రేటర్‌జోన్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు.

వెయ్యి బస్సులు..

ప్రస్తుతం నగరంలో ఏ మార్గాల్లో.. ఏ సమయాల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అంచనా వేశారు. బస్టాపుల్లో సిబ్బందిని పెట్టి సమయపాలనకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎప్పుడు.. ఏ సమయంలో ప్రయాణికులున్నారో తెలుసుకుని తదనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. రద్దీ లేని సమయంలో 25 శాతం బస్సులు నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండడంతో వెయ్యి వరకూ బస్సులు నడుపుతున్నారు.

అలాగే నగరం నలువైపులా ఉన్న జిల్లాలకు వెళ్లే బస్సులు కూడా మధ్యాహ్న సమయంలో నగరంలో నడుపుతున్నారు. అలాగే జిల్లాలకు వెళ్లే బస్సులు కూడా నగరంలోని ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. కేవలం 25 శాతం బస్సులు అంటే 732 మాత్రమే.. నగర వ్యాప్తంగా 32 మార్గాలకే ఆదిలో పరిమితం చేసిన ఆర్టీసీ.. ఇప్పుడు బస్సు మార్గాలను కూడా పెంచింది. దాదాపు మరో 10 మార్గాల్లో బస్సులను అందుబాటులోకి తెచ్చామని ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు.

నవంబరులో అయినా ఎంఎంటీఎస్‌..?

ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పండగ ప్రత్యేకాలంటూ ప్రత్యేక రైళ్ల సంఖ్యను కూడా పెంచారు. ఇలాంటి పరిస్థితుల్లో నగర ప్రయాణికులకు అతి తక్కువ టిక్కెట్‌ ధరతో వేగంగా తీసుకెళ్లే ఎంఎంటీఎస్‌ రైళ్లు ఇంకా పట్టాలెక్కకపోవడంపై నగర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజలు, సామాన్య ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ సేవలు ప్రారంభించాలని కోరుతున్నారు. నవంబరు 1వ తేదీ నుంచి అయినా ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే ఎంఎంటీఎస్‌లు నడుపుతామని.. ఇప్పటికే రైళ్లను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.