నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. సమ్మెకు సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో సీఐటీయూ జిల్లా కమిటీ నేతలు ఆవిష్కరించారు. అన్ని గ్రామాల్లోని కార్మిక సంఘాలతో పోస్టర్లను ఆవిష్కరించి కార్మిక వ్యతిరేక విధానాల పట్ల విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తామని తెలిపారు.
అన్ని కార్మిక సంఘాలతో ఈనెల13న కోతిరాంపూర్లోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి ఆల్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర న్యాయకత్వం హాజరు అవుతుందని వెల్లడించారు. సదస్సుకు జిల్లా ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఉపాధ్యక్షులు బండారి శేఖర్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!