తెలంగాణలోని చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు కల్పించటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో తోడ్పాటునందించేందుకు రాష్ట్ర పారిశ్రామికవేత్తల బృందం ఇజ్రాయిల్‌లో పర్యటించనుంది. నవంబర్ 16 నుంచి 21 వరకు భారత పారిశ్రామిక సమాఖ్య ఆధ్వర్యంలో 16 మంది వాటర్ టెక్నాలజీస్ ఎగ్జిబిషన్‌తో పాటు వివిధ పరిశ్రమలను సందర్శించనున్నారు. వ్యవసాయం, జలవనరులు, పునరుత్పాదక శక్తి, ఆరోగ్య రంగాల్లో అక్కడి పరిశ్రమల నుంచి సహకారం మరింత పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. అందుబాటు ధరల్లో అవసరమైన సాంకేతికతపై ఈ బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు తెలిపింది.
ఇవీ చూడండి: నకిలీ వార్తలపై కఠిన చర్యలకు ట్విట్టర్ సంసిద్ధం!