ETV Bharat / state

అయ్యన్నపాత్రుడి అరెస్టులో అన్ని నిబంధనలు పాటించాం: సీఐడీ డీఐజీ - తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అరెస్టుపై సీఐడీ

CID DIG: ఏపీలో అయ్యన్నపాత్రుడి అరెస్టు విషయంలో అన్ని నిబంధనలు పాటించామని సీఐడీ డీఐజీ స్పష్టం చేశారు. ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం అయ్యన్న, ఆయన కుమారుడిని విశాఖ కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు.

అయ్యన్నపాత్రుడి అరెస్టులో అన్ని నిబంధనలు పాటించాం: సీఐడీ డీఐజీ

author img

By

Published : Nov 3, 2022, 3:20 PM IST

CID DIG: సీఐడీ ఏడీజీ ఆదేశాల మేరకు అయ్యన్నపాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులు విజయ్‌, రాజేష్‌లపై కేసు నమోదుచేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు పంపినట్లు వెల్లడించారు. అయ్యన్న, ఆయన కుమారులు ఎన్వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగంపై కేసు నమోదు చేశామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఇరిగేషన్ ఈఈ కె.మల్లిఖార్జునరావు సీఐడీ ఏడీజీకి ఫిర్యాదు చేసినట్లు ఆ కాపీని ఎఫ్‌ఐఆర్‌కు జతచేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపి ఏ-1గా అయ్యన్నపాత్రుడు , ఏ-2గా చింతకాయల విజయ్, ఏ-3గా రాజేష్‌తో పాటు మరికొందరిపైన ఐపీసీ 464, 467, 471, 474 రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

"అయ్యన్నపాత్రుడి అరెస్టు విషయంలో అన్ని నిబంధనలు పాటించాం. ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారనే అభియోగాలపై కేసు నమోదు. ఐపీసీ 464, 467, 471, 474 రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఏ-1 అయ్యన్న, ఏ-2 విజయ్, ఏ-3గా రాజేష్‌పై కేసు నమోదు. నకిలీ ఎన్‌వోసీ తీసుకురావడం మామూలు విషయం కాదు. నకిలీ డాక్యుమెంట్లతో భూమి ఆక్రమించారు." -సీఐడీ డీఐజీ

విశాఖ సీఐడీ కార్యాలయం నుంచి తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్​లను వైద్యపరీక్షల నిమిత్తం సింహాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు విశాఖ కోర్టుకు తరలించనున్నారు.

అయ్యన్నపాత్రుడి అరెస్టులో అన్ని నిబంధనలు పాటించాం: సీఐడీ డీఐజీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.