రాచకొండ పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం అపహరించారు. కమలానగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి సంతోశ్ కుమార్ ఇంటికి తాళం వేసి కూకట్పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో భద్రపరిచిన 19 తులాల బంగారు ఆభరణాలు, రూ. 3 లక్షల 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారు. దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నా.. దొంగలు చెలరేగిపోతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: 'రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే అంశం పరిశీలనలో ఉంది'