మెగాస్టార్ చిరంజీవి జీవిత విశేషాలపై రాసిన 'ది లెజెండ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ సినీ పాత్రికేయులు వినాయకరావు రచించిన ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని ద పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఆ పుస్తకాన్ని అవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి తనయుడు, సినీ హీరో రాంచరణ్‌తోపాటు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకుడు బి. గోపాల్, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, నిర్మాత, రాజకీయ నేత సుబ్బిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిరంజీవి అభిమానులను ఘనంగా సత్కారించారు. చిరంజీవి సినీ చరిత్ర, ఖైదీ 150కి ముందు, ఆ తరువాత సాగిందని హీరో రాంచరణ్ అన్నారు. చిరంజీవి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : పాపను బలిగొన్న పట్టణ ప్రగతి