శబరిమల భక్తులకు.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయం తరఫున అండగా ఉంటామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశం విషయమై ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుతున్న సందర్భంగా ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు.
సేవ్ శబరిమల నినాదాలతో ప్రదర్శన చిలుకూరు బాలాజీ దేవాలయ ఆవరణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులకు దేవాలయాలపై తీర్పును వెలువరించే హక్కు లేదన్నారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో.. తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ