ETV Bharat / state

Children Parliament Prime Minister Story : బస్తీ నుంచి అమెరికా వరకు.. 'చిల్డ్రన్​ పార్లమెంట్​ ప్రధాని' జర్నీ ఇదే.. - చిల్డన్స్ పార్లమెంట్​ ప్రధాని ఏమి చదువుకొంది

Children Parliament Prime Minister Story : చిన్నప్పటి నుంచి ఎటు చూసినా చెత్త. ఇంటినిండా పేదరికం. చెత్త సేకరించకపోతే తిండి కూడా ఉండని దయనీయ పరిస్థితి. ఉపాధి కోసం ఊరిడిచి వచ్చిన దీన జీవితం. కాలేజీలో చెత్త ఏరుకునే అమ్మాయి అనే సూటిపోటి మాటలు.. ఇవేవీ ఆ యువతి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేక పోయాయి. పరిస్థితులకు ఎదురునిలిచి పోరాటం చేస్తోంది ఆ యువ సామాజిక కార్యకర్త. చిల్డన్స్ పార్లమెంట్​కు ప్రధానిగా ఎంపికైంది. అంతేనా 19 ఏళ్లలోనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణకు అమెరికా వెళ్లొచ్చింది. బస్తీ నుంచి అగ్రదేశం వెళ్లొచ్చిన ఆమె ప్రయాణమేంటో మనం తెలుసుకుందాం.

Garbage Girl jayalaxmi Full Details
Children Parliament Prime Minister Jayalaksmi Life Story
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 1:52 PM IST

Children Parliament Prime Minister Story బస్తీ నుంచి అమెరికా వరకు.. చిల్డ్రన్​ పార్లమెంట్​ ప్రధాని జర్నీ ఇదే..

Children Parliament Prime Minister Story Hyderabad : జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు.. ఒక్కొక్కరిది ఒక్కో గాధ.. పరిస్థితులను తిట్టుకుంటూ బతుకు బండిని భారంగా లాగించేవారు కొందరైతే.. వాటిని ఎదుర్కోలేక తనువు చాలించేవారు మరికొందరు. ఎదురించి పోరాడి విజయం సాధించేవారు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాకు చెందిన అరిపిన జయలక్ష్మి.. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్​కి వలస వచ్చారు. మొదట్లో ముగ్గులు అమ్ముతూ జీవనం సాగించేవారు. తర్వాత ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడాన్ని ఉపాధిగా ఎంచుకున్నారు. తల్లి, తండ్రీ చెరో బండి తీసుకుని చెత్త సేకరించేవారు.

Children Parliament PM Jaya Lakshmi : చిన్నప్పటి నుంచి కుటుంబ కష్టాలు వారి పేదరికం గురించి అవగాహన చేసుకున్న జయలక్ష్మి(Jayalakshmi).. 7వ తరగతి నుంచి తల్లిదండ్రులకు పనిలో సాయం చేసేది. ఆమె దినచర్య ఇతర పిల్లలకు భిన్నంగా ఉండేది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి 8 గంటల వరకు తల్లితో పని చేసిన తర్వాత కళాశాలకు వెళ్లేది. సాయంత్రం సమయంలో వారి బస్తీలోని ఒక ఖాళీ ప్రదేశంలో పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతోంది. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న జయలక్ష్మీ ఇప్పటికీ చెత్త తీయడంలో సాయం చేస్తూ చదువుకుంటోంది.

పేదరికాన్ని జయించడానికి చదువు ఒక్కటే మార్గమని ఆ యువతి బలంగా నమ్మింది. చిన్న వయసు నుంచి నలుగురిలో కలవడం, చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కార మార్గాలు ఆలోచించడం జయలక్ష్మికి అలవాటు. స్థానిక కాలనీలో నీరు రాకపోయినా, రోడ్లు బాగాలేకపోయినా.. వీధి దీపాలు.. ఇలా సమస్య ఏదైనా స్థానికులతో కలిసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేది. తను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన ఒక ఎన్​జీఓ సంస్థ తమతో కలిసి సేవ చేయమని చేర్చుకుంది. కాలనీల్లో యువతులకు రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య అంశాలు, బాల్య వివాహాలు చేసుకోకుండా అవగాహన కల్పిస్తూ ఉండేది.

SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది'

Children Parliament PM Jaya Lakshmi Journey : పిల్లలంతా కలిసి నాయకులను ఎన్నుకుని స్థానికంగా ఉండే సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ఏర్పడిందే చిల్డ్రన్స్ పార్లమెంట్. దీనికి హైదరాబాద్ తరపున ప్రధానిగా జయలక్ష్మి ఎన్నికయ్యారు. అయితే ఈ చిల్డ్రన్ పార్లమెంట్ ద్వారా ఎన్నో సాధించుకున్నామని వాటిలో మచ్చుతునకలాంటిది అంగన్వాడీలు ఏర్పాటు చేయించుకోవటం. 21 మురికివాడల్లో అండన్వాడీలు లేవని గుర్తించిన వీరు.. చిన్నపిల్లలకు అల్పాహారం అందించకపోవడం, కేంద్రాల సంఖ్య కూడా తక్కువ ఉన్నాయని తెలుసుకుని స్థానికులతో కలసి శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

పిల్లలు వచ్చి ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే స్పందించి అదనపు అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. అహింసా పద్ధతిలో ప్రజా ఉద్యమాలు ఎలా చేయాలనే అంశంపై 'గాంధీ-కింగ్ స్కాలర్లీ ఎక్సేంజ్(Gandhi King Scholarly)' అనే స్కాలర్ షిప్ పొంది అమెరికాకు రెండు వారాల పాటు వెళ్లింది. అహింసా పద్ధతిలో ప్రజల సమస్యలపై ఎలా పోరాడవచ్చో ఈ పర్యటన వల్ల తెలుసుకున్నానని తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కోసం భారత్ నుంచి 4వేల అప్లికేషన్లు రాగా పది మంది సెలక్టయ్యారు. తెలంగాణ నుంచి సెలక్టయిన నలుగురిలో తను ఒకరవడం ఎంతో సంతోషాన్నిచ్చింది చెప్పింది.

Kalari Training in Kodangal : కలరిపయట్టు.. మరచిపోతున్న కళను నేర్పిస్తున్న యువకుడు

Children Parliament PM Jaya Lakshmi Story : చిన్నప్పటి నుంచి కుటుంబ కష్టాలను తెలుసుకుని.. పనిలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేదని.. కష్టం చూసి పెరగటం వల్ల సమాజంలోని సమస్యలపై ఎప్పుడూ పొరాడుతూ ఉండేదని ఆమె తల్లి ఉష అన్నారు. కాలం కలిసొస్తే తన కూతురును కలెక్టర్​గా చూడాలనేది తన జీవితాశయమని చెప్పారు. కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. తన అక్క జయ మార్గనిర్దేశంలోనే తాను ఇంటర్ వరకు పూర్తి చేసి డిగ్రీ చదువుతున్నానని జయలక్ష్మీ చెల్లి కల్యాణి తెలిపింది. చిన్ననాటి నుంచి జయలక్ష్మీ చాలా చురుకుగా ఉండేదని.. కుటుంబానికి సాయం చేస్తూనే కాలనీలోని సమస్యలపై తరచూ మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేసేదని స్థానికులు తెలిపారు.

కరోనా లాంటి కష్డ సమయాల్లో ప్రజలకు అవగాహన కల్గించిందని, అవసరమైన వారికి ఆహార పదార్థాలు కూడా అందించిందని స్థానికులంటున్నారు. ఎన్ని విజయాలు సాధించినా చెత్త సేకరిస్తానని చిన్న చూపు చూసేవారున్నారని పేర్కొంది. ఇంతకష్టపడి చదువుకుంటోందని గర్వంగా చెప్పుకునే స్నేహితులూ ఉన్నారని చెప్పింది. విమర్శల గురించి పట్టించుకునే స్థాయిని తాను దాటానని.. తనేంటో నిరూపించుకనే రోజు వస్తుందని ఆశా భావం వ్యక్తం చేసింది. చేసే పనిని ఏరోజూ కష్టంగా భావించలేదని.. కష్టపడి ఉన్నత చదువులు చదివి ఏనాటికైనా ఐఏఎస్​ సాధించి.. ప్రజాసేవ చేయడమే తన జీవిత లక్ష్మ్యమని తెలిపింది.

Young cloud Photographer in Hyderabad : ఫొటోలతో మేఘ సందేశం.. చూస్తే వావ్​ అనాల్సిందే..!

Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.