ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురంలో కరోనాపై చిన్నారులు అవగాహన కల్పించారు. ఆడుకునే వయసులో ఆటకు విరామం ఇచ్చి మాస్కులు పంచారు. శానిటేషన్ వస్త్రం, పిన్నులు కొని... మాస్కులు తయారు చేశారు. వాటిని గ్రామస్థులకు పంచి.. పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చేతులు డెటాల్తో కడుక్కోవాలని జాగ్రత్తలు చెప్పారు. వారి ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.
ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...