ETV Bharat / state

బట్టలు కొనివ్వలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక

తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని ఇల్లు వదిలి వెళ్లిన 10 ఏళ్ల బాలిక మిస్సింగ్​ కేసును పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు. ఏపీ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది.

author img

By

Published : Nov 15, 2020, 8:56 AM IST

child
బట్టలు కొనివ్వలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక

పండుగ సందర్భంగా తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని ఓ బాలిక ఇల్లు వదిలి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్​ అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ కేసును 2 గంటల్లోనే ఛేదించారు. గుంతకల్లు పట్టణానికి చెందిన పదేళ్ల బాలిక మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బయటకు వెళ్లిపోయింది. ఇంటికొచ్చిన తల్లి.. బాలిక కోసం చుట్టు పక్కల అంతా గాలించింది. ఆచూకీ లభించకపోవడంతో స్థానికుల సహాయంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డికి సమాచారం అందించారు. డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు చుట్టుపక్కల స్టేషన్లకు సమాచారం అందించారు. 8 బృందాలుగా విడిపోయి పట్టణం అంతా గాలించారు. 2 గంటల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్నారు. గుంతకల్లులోని చర్చి వద్ద బాలిక ఆచూకీ లభ్యమైంది.

పాపకు కొత్త బట్టలు

ఈ సంఘటనతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు.. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటి నుంచి వెళ్లిన కారణాలను అడగగా కొత్త డ్రెస్ కొనివ్వలేదని.. ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలిపింది. పోలీసులే బాలల దినోత్సవం సందర్భంగా కొత్త బట్టలు కొనిపెట్టి బాలికను తల్లికి అప్పగించి పెద్ద మనసును చాటుకున్నారు. పోలీసులు 2 గంటల్లోనే సహకరించి తమకు అప్పగించినందుకు తల్లి సంతోషం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: పాకిస్థాన్​ కవ్వింపు చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.