ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... తనపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న (Theenmar Mallanna). చట్టాల పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. సికింద్రాబాద్ మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకులు చేసిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు విచారించారు. దాదాపు రెండు గంటల పాటు పలు విషయాలపై ప్రశ్నించారు.
మూడు నెలల క్రితం మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకులు తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం తీన్మార్ మల్లన్నను ఇంటికి పంపారు. ఈనెల 8న తిరిగి మరోసారి విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై ఎన్ని కేసులు పెట్టినా అరాచకాన్ని సృష్టించిన తమ పోరాటం ఆగదని మల్లన్న స్పష్టం చేశారు.
వివరణ ఇచ్చినా... తీరా మళ్లీ రెండే రోజుల్లో రావాలని నోటీసులు ఇచ్చారు. నాకు తెలుసు ఇందులో పొలిటికల్ నాయకుల ప్రమేయం ఉంది. పాపం ఆ పోలీసు వాళ్లు వాళ్లకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఎంత ఒత్తడి పెట్టినా... ఎన్ని నిర్బంధాలు చేసినా... మీరు ఏమీ చేయలేరు. చట్టం మావైపు ఉంది. మేము న్యాయస్థానాలను గౌరవిస్తాం. ఇన్వెస్టిగేషన్ ఇంకా అయిపోలేదు... 8న మళ్లీ రమ్మని నోటీసులు ఇచ్చారు. ఇదంతా తీన్మార్ మల్లన్న గొంతు నొక్కే కార్యక్రమం. హెబియస్ కార్పస్ కూడా కొద్దిసేపటి కిందే మూవ్ చేశాం. ఈ దమనకాండను ఆపేందుకు హైకోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానాలు మా పక్షానా నిలబడతాయనే నమ్మకం ఉంది.
-- తీన్మార్ మల్లన్న
ఇదీ చదవండి: KRMB, GRMB Boards Meeting: ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం