సచివాలయ కార్యాలయాల తరలింపులో మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం సహా వీలైనంత వరకు అన్ని శాఖల కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌కే తరలించాలని తొలుత భావించారు. బీఆర్కే భవన్లో భద్రతా పరమైన అంశాలు, ఇతర కారణాల దృష్ట్యా సీఎం కార్యాలయాన్ని మరో చోటుకు తరలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం బేగంపేటలో ఆధునిక హంగులతో నిర్మించిన మెట్రో రైలు భవనాన్ని పరిశీలిస్తున్నారు.
నాలుగు అంతస్తుల మేర ఉన్న ఈ భవనం భద్రతాపరంగా, ఇతర అంశాల పరంగా అనువుగా ఉండడం... ప్రగతి భవన్‌కు సమీపంలోనే ఉండడం వల్ల ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇక్కడకు తరలించడం మేలన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. సీఎంఓ కార్యదర్శుల కార్యాలయాలను కూడా అక్కడకే తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో సచివాలయ కార్యాలయాల తరలింపు విషయమై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చూడండి: బిగ్‌బాస్ నిర్వాహకులపై సినీనటి గాయత్రీగుప్తా ఫిర్యాదు