CM KCR Delhi Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో మంగళవారం దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. చికిత్సలో భాగంగా బుధవారం మరోసారి వైద్యురాలిని ముఖ్యమంత్రి కలవనున్నట్లు సమాచారం. సీఎం సతీమణి శోభ బుధవారం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు తెలిసింది. గతంలోనూ ఆమె అక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి పలు విపక్ష పార్టీల నేతలను కలుస్తారనే ప్రచారం సాగినా అందుకు సంబంధించిన ఎటువంటి కదలికలు కనిపించలేదు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, రాజకీయపరమైనది కాదని తెరాసకు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి దంపతులు తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారని ఆయన చెప్పారు.
స్టాలిన్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ మంగళవారం స్టాలిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ కూడా స్టాలిన్‌కు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: