గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వలస కార్మికులను.. రోజుకో రైల్వే స్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 976 మంది వలస కార్మికులు బయలుదేరి వెళ్లారు.
అయితే అధికారుల జాబితా ప్రకారం.. 2,100 మంది వలస కార్మికులు వస్తారని అనుకున్నా.. కేవలం 976 మంది మాత్రమే వచ్చారు. వచ్చిన వారికి నీరు, ఆహారం అందించి సొంత ప్రాంతాలకు పంపించారు. వలస కూలీలంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం చంపా రైల్వేస్టేషన్ లో దిగనున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం