Cheguvera daughter and granddaughter visited Hyderabad: ప్రపంచ విప్లవ యోధుడు కామ్రేడ్ చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, మనమరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌ను సందర్శించారు. వారికి సీపీఐ నాయకులు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం క్యూబా సంఘీభావ సభను నిర్వహించారు.
చేగువేరా కూతురు సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. 'గువేరా' అనేది వారి ఇంటి పేరని.. ఆ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్తేజ పరుస్తోందన్నారు. మన భారతదేశంలో భగత్‌సింగ్ ఎలానో ప్రపంచానికి చేగువేరా అలాంటి గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఎప్పటికైనా కమ్యునిజం అజేయంగా నిలుస్తుందన్నారు.
చేగువేరా కుమార్తె ఇక్కడికి రావడం అభినందనీయమని, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల సమన్వయంతో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అలైదా గువేరాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పలువురు సీపీఐ నాయకులు, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల మహిళా నాయకులు ఘనంగా సన్మానించారు. సభ అనంతరం అలైదా గువేరాతో ఫోటోలు దిగడం కోసం ఒక్కొక్కరు రాకుండా గుంపులుగా రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను గొప్ప వ్యక్తిని కాదని సామాన్య మహిళనేని తెలిపారు.
"ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా మరణించినప్పుడు యువకుడు, ఇప్పుడు యువకుడే, రాబోయే తరాలకు కూడా యువకుడే. సూర్యుచంద్రులు ఉన్నంత కాలం ఆయన పేరు అలానే ఉంటుంది. భారతదేశంలో భగత్‌సింగ్ ఎలాగో ప్రపంచానికి చేగువేరా అలాంటి గొప్ప విప్లవ వ్యక్తి. ఆయన అర్జెంటీనాలో పుట్టారు. ఆ తరవాత క్యూబాలో విప్లవాన్ని విజయవంతం చేశారు. దాంతో ఒక్కొక్క దేశం వెళ్లి విప్లవాలు ద్వారా సామ్రాజ్య వాదం నుంచి విముక్తి చేశారు. చివరికి ఒరివియాలో మరణించారు. ఆనాడు ఆయన వేసిన విప్లవ బీజాలే ప్రస్తుతం ప్రపంచం అంతటా వ్యాపించాయి. ప్రపంచానికి వెలుగునిచ్చే వేగుచుక్క ఎలానో విప్లవానికి వెలుగు చూపించిన చేగువేరా అలానే. ఈరోజు ఆయన కుమార్తె మన పార్టీ కార్యాలయాన్ని సందర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది. చేగువేరా స్ఫూర్తి మనందర్ని నడపాలని కోరుకుంటున్నాను." - కునమనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: