ETV Bharat / state

పాతబస్తీలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు - శివాజీ జయంతి ద్విచక్రవాహన ర్యాలీ

పాతబస్తీలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భాగ్యనగర్ ప్రజాహిత సమితి ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఈసారి మహిళలు పాల్గొనడం విశేషం.

chatrapathy Sivaji birthday celebrations at pathabasthi
పాతబస్తీలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు
author img

By

Published : Feb 20, 2021, 8:41 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో ఛత్రపతి శివాజీ 391వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్ ప్రజాహిత సమితి ఆధ్వర్యంలో శోభాయాత్రతో పాటు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సరూర్‌నగర్‌ శివాజీ విగ్రహం నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్, దోబీఘాట్ ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది.

బైక్ ర్యాలీలో ఈసారి మహిళలూ పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ వేడుకలు జరిగాయి. అనంతరం మాదన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సాంస్కృతిక నృత్యాలు చేశారు. భాగ్యనగర్ ప్రజాహిత సమితి సభ్యులు, మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇదీ చూడండి: సచివాలయ భవనానికి అదనపు హంగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.