TSRTC CHARGES: గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ ఛార్జీలను పెంచేస్తున్నారు. ఎటువంటి ప్రకటన లేకుండా.. ఈనెల 18న చిల్లర సమస్యలకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండ్అప్ చేసి ఛార్జీలు పెంచేశారు. ఇక తాజాగా ప్రయాణికుల సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి కంగుతింటున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.
టీఎస్.ఆర్టీసీ చార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే.. అసలు ఛార్జీలు పెంచలేదు కదా అని యాజమాన్యం అంటోంది. కేవలం కొసరు ఛార్జీలను మాత్రం పెంచామని ఆర్టీసీ యాజమాన్యం సమర్థించుకుంటుంది. ఆర్టీసీలో తాజాగా ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 5రూపాయలకు పెంచారు. సూపర్ లగ్జరీ , రాజధాని, గరుడ బస్సుల్లో ఈ ఛార్జీలను 10 రూపాయల వరకు పెంచేశారు. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈనెల 18వ తేదీన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో చిల్లర సమస్య పరిష్కారానికి రౌండప్ ఛార్జీలను ఖరారు చేశారు.
ఈ కొత్త (రౌండప్) ఛార్జీలను ఈనెల 18వ తేదీ నుంచి అమలు చేస్తోంది. రూ.12ఛార్జీ ఉన్న చోట టికెట్‌ను రూ.10 వరకు రౌండప్ చేశారు. రూ.13, రూ.14 ఉన్న చోట ఆ టికెట్లను రూ.15గా రౌండప్ చేశారు. 80 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా.. రౌండప్ ఖరారుతో ఛార్జీలు రూ.65గా నిర్ధారించారు. వీటికి అదనంగా టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సులకు ఐదు రూపాయలు, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10లకు పెంచినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఆర్టీసీ అసలు ఛార్జీలు కూడా పెంచనున్నట్లు యాజమాన్యం తెలిపింది.
ఇవీ చూడండి:
Yadadri Temple Reopening : ఏడు గోపురాల వైభవం.. యాదాద్రీశుడి ఆలయం
Tollgates in AP: తగ్గనున్న టోల్ గేట్లు.. అవన్నీ మూతపడే అవకాశం..!