Banjarahills Police Filed Chargesheet Against Sharmila : వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసులు ఛార్జిషీట్ ధాఖలు చేశారు. కాగా.. ఇటీవల ఆమె పోలీసులపై దాడి చేసి, వారి విధులు అడ్డుకున్నారని కేసు నమోదైంది. దీంతో ఆమెకు డిసెంబరు 20వ తేదీన విచారణకు రావాలని షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
Case Against Sharmila in Banjarahills Police station : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గత నెల 18న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రెస్‌మీట్, సమాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాటారని ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ మే 16వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్‌ని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ప్రస్తావించడంతో పాటు సీఎం కేసీఆర్ పేరుపై అఫిడవిట్ తయారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేందర్ యాదవ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వైఎస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- YS Sharmila : లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల
- YS SHARMILA: "సిట్ కార్యాలయానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు?"
Case Registered Against YS Sharmila At Jubilee Hills PS : గతంలో వైఎస్ షర్మిల ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా రెడ్‌విత్ 34, 337, మరో రెండు సెక్షన్ల కింద కూడా కేసు ఫైల్ చేశారు. అయితే పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో అరెస్టయిన వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో షర్మిలకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Case Filed Against YS Sharmila : షర్మిల తరఫున వాదించిన న్యాయవాది.. నోటీసులు ఇవ్వకుండానే ఆమెను అడ్డుకున్నారని న్యాయస్థానానికి వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటకు వెళ్లనివ్వట్లేదని పేర్కొన్నారు. షర్మిల విషయంలో పోలీసులు ఇష్టారీతిగా వ్యవహారించారని కోర్టులో వాదించారు. షర్మిలను ఎస్సై తాకేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు ఆమె చేయి విరిచేందుకు యత్నించారన్నారు. పోలీసులు కొట్టారు.. ఆ క్రమంలోనే వైఎస్ షర్మిల పోలీసులు తోసేశారని తెలిపారు.
పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని న్యాయస్థానానికి వివరించారు. పోలీసులపై చేయి చేసుకుంటే తప్పుడు సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. కారును వేగంగా పోనివ్వాలని షర్మిల తన డ్రైవర్‌కు సూచించారని వివరించారు. ఈ మేరకు ఆమె కారు తగిలి అక్కడున్న కానిస్టేబుల్ కాలుకు గాయమైందని కోర్టులో పోలీసుల తరఫున న్యాయవాది వాదించారు.
ఇవీ చదవండి: