ETV Bharat / state

GHMC meeting: నిరసనలు.. వాకౌట్​లతో.. GHMC కౌన్సిల్​లో గందరగోళం - Chaos at GHMC Council Meeting

GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వివిధ కారణాలతో 5 నెలల తర్వాత జరిగిన సమావేశం.. నిరసనలు, వాగ్వాదాలతో ప్రారంభమైంది. బీజేపీ కార్పొరేటర్ల తీరును నిరసిస్తూ.. అధికారులు వాకౌట్‌ చేశారు. కార్యకలాపాలు ముందుకు సాగకపోవటంతో సమావేశం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు. బీజేపీ సభ్యుల తీరును తప్పుబట్టిన మేయర్‌ విజయలక్ష్మి.. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చర్యలు సరికావని హితవు పలికారు.

GHMC meeting
GHMC meeting
author img

By

Published : May 3, 2023, 3:43 PM IST

నిరసనలు, వాకౌట్‌లతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో గందరగోళం

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల ఆందోళన, అధికారుల వాకౌట్‌తో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నగరంలో సమస్యల పరిష్కారం కోరుతూ.. నిన్న పలువురు బీజేపీ కార్పొరేటర్లు జలమండలి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకోగా.. ఇవాళ జరగాల్సిన పాలకమండలి సమావేశానికి ముందే నిరసనలతో హోరెత్తించారు. వినూత్న ప్రదర్శనలతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.

GHMC Council Meeting today: మరోవైపు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నగరంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం, సమావేశం ప్రారంభం కాగా.. కాసేపటికే బీజేపీ కార్పొరేటర్లు సమావేశంలో నినాదాలు చేశారు. మేయర్‌ విజయలక్ష్మి వారిస్తున్నా వెనక్కి తగ్గలేదు. పలువురు కార్పొరేటర్లు మేయర్‌ కుర్చీ వద్దకు వెళ్లటంతో సమావేశంలో రసాభాస నెలకొంది. ఈ క్రమంలోనే జలమండలి కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణించిన అధికారులు సమావేశాన్ని వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Chaos at GHMC Council Meeting :తమ కార్యాలయం ముందు టిల్ట్‌ వేయటాన్ని అవమానంగా భావించినట్లు అధికారులు మేయర్‌కు వివరించి, అనంతరం సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. జలమండలి అధికారులకు సంఘీభావంగా జీహెచ్‌ఎంసీ అధికారులూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ వైపు అధికారుల బాయ్‌కాట్, విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనటంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు. కాగా పాలకమండలి సమావేశం వేళ బీజేపీ కార్పొరేటర్ల తీరును మేయర్‌ విజయలక్ష్మి తప్పుబట్టారు. సమావేశంలో సమస్యలు చర్చించకుండా అధికారులను దూషించటం, వాగ్వాదం దిగటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం యత్నించటం సరికాదని మేయర్ హితవు పలికారు.

GHMC officials walkout: మేయర్‌ వైఫల్యంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ కార్పొరేటర్లు ఎదురుదాడి చేశారు. తాము ప్రజాసమస్యలపై పోరాడుతుంటే సమాధానం చెప్పలేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారని మండిపడ్డారు. అధికారులే వాకౌట్‌ చేయటం జీహెచ్‌ఎంసీ చరిత్రలో తొలిసారి అని దీనికి మేయర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

"జీహెచ్‌ఎంసీ సమావేశం జరగకుండా చూడాలని బీజేపీ యత్నం. సమావేశంలో సమస్యలు చర్చించకుండా వాగ్వాదానికి దిగారు. ప్రజాధనాన్ని బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్ల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. బీజేపీ నేతల దూషణలను అధికారులు వ్యతిరేకిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అధికారులు బాధపడుతున్నారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం యత్నిస్తున్నారు. జలమండలి అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు ఉద్దేశపూర్వకంగా ఆందోళన చేశారు. ప్రతిసారి కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు".- విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ మేయర్‌

ఇవీ చదవండి:

CLP Bhatti Vikramarka : 'ఏదో రోజు.. తెలంగాణను ఏ రాష్ట్రానికో తాకట్టు పెట్టేస్తారు'

CM KCR: 'తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది.. రైతులు ఆందోళన చెందవద్దు'

దాహం తీరాలంటే రోజూ ఎండలో 2కి.మీ నడవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.