ETV Bharat / state

Engineering Counseling: ఎంసెట్​ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ మారింది..

ఎంసెట్‌ ఇంజినీరింగ్ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ నెల 4న మొదలు కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదును వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రవేశాల కన్వీనర్ వెల్లడించారు. ఈ నెల 18న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.

Engineering Counseling: ఎంసెట్​ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

author img

By

Published : Sep 2, 2021, 3:35 PM IST

ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఈ నెల 4న మొదలు కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదును వారం పాటు వాయిదా వేసినట్లు ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు.

ఈ నెల 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 4 నుంచి 11 వరకు యథాతథంగా కొనసాగనుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇప్పటికే ప్రారంభమైన స్లాట్ బుకింగ్ ప్రక్రియ.. ఈ నెల 9 వరకు ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇప్పటి వరకు సుమారు 28 వేల మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి 23 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు.

వెయిటేజీ తొలగింపు..

గత నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది హాజరయ్యారు. ఈ ఏడాది 45 శాతం మార్కుల నిబంధన ఎత్తేసిన సర్కారు... ఇంటర్ ఉత్తీర్ణులైన వారంతా ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హులని ప్రకటించింది. ఎంసెట్ ర్యాంకులో ఇంటర్, సీబీఎస్​ఈ మార్కులకు వెయిటేజీ తొలగించారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ఇదే..

ఆగస్టు 30 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తొలి విడత ప్రక్రియ ప్రారంభం కాగా.. అదేరోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు ఆన్​లైన్​లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబరు 15న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.. 15 నుంచి 20 వరకు ఆన్​లైన్​లో విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ షెడ్యూల్​లో మార్పులు జరిగాయి.

ఏపీ విద్యార్థుల సత్తా..

మరోవైపు తెలంగాణ ఎంసెట్ (TS EAMCET RESULTS) ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌లో తొలి రెండు ర్యాంకులు సహా టాప్‌-10లో ఆరు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు.

సంబంధిత కథనాలు..

Engineering Counselling: ఇంజినీరింగ్ కొత్త విధానమేంటి? కౌన్సెలింగ్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

TS EAMCET RESULTS: ఎంసెట్ ఫలితాలు విడుదల... ర్యాంకులను ఇలా చూసుకోండి

Engineering Counseling: ఎంసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.