ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపుల్లో (Curfew Relaxations) ప్రభుత్వం మార్పులు చేసింది. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా సినిమా థియేటర్లకు అనుమతినిచ్చింది. 50 శాతంతో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప.. అన్ని జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రెండు జిల్లాలో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపు చేయగా.. 6 గంటలకే దుకాణాల మూసివేయాలని ఆదేశించింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపు ఉంటుందని... రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయాలని తెలిపింది.
వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర సీఎం (cm jagan) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాజిటివిటీ రేటు 5 శాతంలోపు వచ్చే వరకు ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఈ సడలింపులు ఈనెల 8 నుంచి అమలు కానున్నాయని జగన్ తెలిపారు.