రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు ప్రకటించారు. అది గమ్యస్థానానికి 8.45 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని వివరించారు.
ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి యథావిధిగా మొదటి రైలు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు మాస్కు, శానిటైజర్లు తప్పక ఉపయోగించాలని సూచించారు. నిబంధనలు పాటించిన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో 6 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు