ETV Bharat / state

రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. పోలవరం పర్యటనలో ఉద్రిక్తత .. - పోలవరం పర్యటన

Chandrababu visit Polavaram to Tension: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలవరం పర్యటన ఉద్రిక్తతగా మారింది. ప్రాజెక్ట్​ సందర్శనకు పోలీసులు అనుమతించలేదు. రహదారికి అడ్డంగా బారికేడ్లతో పాటు ముందుకు వెళ్లకుండా వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో చంద్రబాబు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu polavaram visit
పోలవరం వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Dec 1, 2022, 7:52 PM IST

Updated : Dec 1, 2022, 8:09 PM IST

Chandrababu visit Polavaram to Tension: పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాజెక్టు సందర్శనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లనీయరని పోలీసులను ప్రశ్నించిన చంద్రబాబు.. కాసేపు వాగ్వాదం తర్వాత అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు.

ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలువరించారు. రహదారికి అడ్డంగా బారికేడ్లతో పాటు ముందుకు వెళ్లకుండా వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో చంద్రబాబు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ లిఖితపూర్వకంగా సమాధానం రాసి ఇవ్వాలని పోలీసులను నిలదీశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు తాను ప్రారంభించి, సగానికి పైగా పనులు పూర్తిచేసిన ప్రాజెక్టు వద్దకు తననే వెళ్లనీయరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి తరవాత ప్రతిపక్ష నాయకుడిగా నాకే అధికారం ఉంది. తను పనులు ప్రారంభిస్తే వాటిని నేను చూడడానికి చట్ట ప్రకారం వెళతాను. నేను రాకూడదు అని చెప్పడానికి మీకు అధికారం లేదు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న , 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న నన్ను ఎప్పుడు ఎవరు అడ్డుకోలేదు. నేను ఎవరిని అడ్డుకోలేదు. ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను ఇటువంటి అడ్డుకోవడాలు అన్నీ. అందుకే మీరు రాసి ఇవ్వండి నేను మాట్లాడుతాను. - చంద్రబాబు, టీడీపీ అధినేత

పోలవరం వద్ద చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2022, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.