సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ పోటీలేరని.. ఇంకెవరూ రాలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. సంక్షేమ పథకాలకు నాంది పలికిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు తగ్గించి పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ నాంది పలికారని.. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సంపద సృష్టించి.. పేదవాళ్లకు సంక్షేమ పథకాల కింద ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు, వ్యవస్థ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల కన్నుమూత