ETV Bharat / state

ప్రధాని చెప్పినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: చంద్రబాబు

author img

By

Published : Oct 8, 2020, 8:11 PM IST

కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాల వారితో తెదేపా అధినేత చంద్రబాబు వెబినార్ నిర్వహించారు. కరోనా సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం లభించే సూచనలు లేవని ఆయన పేర్కొన్నారు. కొవిడ్​ మహమ్మారి రెండోసారి తిరగబడుతోందన్నారు.

ప్రధాని చెప్పినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: చంద్రబాబు
ప్రధాని చెప్పినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: చంద్రబాబు

అధిక జనాభా వల్ల దేశంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేకం తలెత్తుతున్నాయన్నారు. పేదల తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని చంద్రబాబు తెలిపారు. ఈ సమస్యను అధిగమించడం పెద్ద సవాల్​గా మారిందన్నారు.

రెండోసారి కరోనా సోకినవారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఆసియా దేశాల్లో రెండోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించడం వల్ల నియంత్రణ సాధ్యమైందన్నారు. పోస్ట్ కొవిడ్‌ను ఎదుర్కోవడంపైనే అందరి భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించట్లేదని విమర్శించారు. నియంత్రణలో విఫలమైనందునే సమస్యలు వచ్చాయన్నారు.

కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నాం. ప్రధాని జాగ్రత్తలు చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మద్యం దుకాణాలు, పాఠశాలలు తెరుద్దామనే ఉత్సాహంతో ఉన్నారు. ఇలాంటి ఆలోచనలే కరోనా వ్యాప్తికి కారణమయ్యాయి.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

'దుబ్బాక ఎన్నిక నాలుగు కోట్ల మంది భవిష్యత్​కు సంబంధించినది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.