ETV Bharat / state

ఆ మహనీయుడి ఆశయాన్ని తుంగలో తొక్కుతున్నారు: చంద్రబాబు

Chandrababu: మద్రాస్ రాష్ట్రంతో కలిసున్నప్పుడు.. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతోందని.. శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. నేడు ఆ తెలుగు వారికే సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేస్తూ.. ఆ మహనీయుడి ఆశయాన్ని తుంగలో తొక్కుతూ.. రాష్ట్ర అభివృద్దికి అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు.

cbn
cbn
author img

By

Published : Dec 15, 2022, 3:03 PM IST

Chandrababu: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహనీయుడి ఆశయాన్ని సీఎం జగన్ రెడ్డి తుంగలో తొక్కుతూ.. రాష్ట్ర అభివృద్ధిని, పురోగతిని ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తూ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి, నివాళులర్పించాలని చంద్రబాబు కోరారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కొనియాడారు. తెలుగువారి ఉనికిని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఆత్మబలిదానం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు.

tdp
tdp

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.