ETV Bharat / state

విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెదేపా బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు తొలి రోజు మాట్లాడిన ఆయన.. కార్యకర్తల కృషిని కొనియాడారు. ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. వైకాపా ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu-fiers-on-ycp-governament-in-mahanadu-meeting
విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?
author img

By

Published : May 27, 2020, 3:53 PM IST

విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు తొలిరోజు మాట్లాడిన ఆయన... తెదేపా కార్యకర్తల కృషిని కొనియాడారు. 38 ఏళ్లుగా కార్యకర్తలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. భుజాలు అరిగేలా తెదేపా జెండాలు మోశారని అన్నారు. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా వెనుకంజ వేయలేదని చెప్పారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచామన్నారు. తెదేపా పాలనలో వినూత్న పద్ధతిలో అభివృద్ధి చేశామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​ను ప్రపంచస్థాయి నగరంగా చేసిన ఘనత తెదేపాదేనన్న ఆయన... జంట నగరాలకు తోడుగా సైబరాబాద్​ను నిర్మించామని చెప్పారు. తెదేపా హయాంలో అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందన్నారు.

కార్యకర్తలకు పాదాభివందనం

గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీశారన్న ఆయన... వైకాపా నేతలు ఉన్మాదులు మాదిరిగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తెదేపా కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని... ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.

"ఆంధ్రప్రదేశ్​లో విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..? రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు చాలా ముఖ్యం. కృష్ణా జలాల పంపిణీలో రెండు రాష్ట్రాలు న్యాయం చేసుకోవాలి'

- చంద్రబాబు తెదేపా అధినేత

ఏపీలో వైకాపా పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్​95 మాస్క్​లు అడిగిన వైద్యుడు సుధాకర్... మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఘటనపై ఫేస్​బుక్​లో పోస్ట్ చేసిన రంగనాయకమ్మపై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. తితిదే భూముల అమ్మకం, మడ అడవులు, సోషల్ మీడియా పై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

భవితరాల భవిష్యత్​ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో తెదేపా బలోపేతం కోసం నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.