ETV Bharat / state

బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు - తెదేపా అధినేత చంద్రబాబు తాజా

గుంటూరులో తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు రోడ్‌షోకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

chandrababu-election-campaign-in-guntur in andhra pradesh
బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు
author img

By

Published : Mar 8, 2021, 2:05 PM IST

బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు

వైకాపాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరింపులకు దిగడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అభివృద్ధి పనులు చేసి ఓట్లు అభ్యర్థించాలని కానీ.. బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్​ పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు.

ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్‌.. నిత్యవసరాల ధరలను విపరీతంగా పెంచారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో సామాన్యుడు జీవించే పరిస్థితులు లేవని.. ఇసుక, లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న అమరావతి మహిళలపై దాడి దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మహిళలకు సామాజిక సాధికారత కల్పించేలా చర్యలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.