తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండురోజులుగా భారీ వర్షాలతో ఏపీలోని ఐదు జిల్లాలు అతలాకుతలమై రైతులకు తీవ్రనష్టం వాటిల్లితే... ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక చర్యలు లేవని వైకాపా ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించారు. గిట్టుబాటు ధర, విపత్తు సాయం ఏదీ లేక రైతులను నష్టాల్లో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులంతా వ్యతిరేకిస్తున్నందున వారికి అండగా ఉండాల్సిన బాధ్యత తెదేపాపై ఉందన్నారు. ఎన్నడూ చూడని దుర్మార్గ పాలన ఏడాదిన్నరగా ఏపీలో చూస్తున్నామని చంద్రబాబు మండిపడ్డారు. నేరచరిత్ర గల వాళ్లు అధికారంలోకి వస్తే వాటిల్లే ఉపద్రవాలకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యువతిపై అత్యాచారం... సహకరించిన మరో ఇద్దరు యువతులు