హైదరాబాద్ బషీర్బాగ్లో నిర్వహించిన సమావేశంలో ఛలో దిల్లీ గోడ పత్రికను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆవిష్కరించారు. వచ్చే నెల 8న మాలలు, మాల ఉపకులాలు, విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు దిల్లీకి తరలివచ్చి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి తమ వాదన వినిపించాలని కోరారు.
దిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు మెమోరాండం ఇవ్వనున్నట్లు చెన్నయ్య తెలిపారు.
ఇదీ చూడండి : బుడిబుడి ప్రయోగాలట.. చంద్రయానే ఆదర్శమట!