ETV Bharat / state

మేమున్నామని... ఆకలి తీరుస్తామని... - హైదరాబాద్​లో పేదలకు ఉచిత భోజనం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన.... ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టాలనే తపన.. అతనిని ముందుకు నడిపించాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి అతడు చేసే సేవ ఎంతో మందికి స్పూర్తినిచ్చింది. 47 రోజుల పాటు 60 వేల మందికి అన్నదానం చేసి అందరి చేత అభినందనలు అందుకున్నాడు మణికొండకు చెందిన చలమారెడ్డి.

chalama-reddy-food-distributed-for-poor-people
మేమున్నామని... ఆకలి తీరుస్తామని...
author img

By

Published : May 18, 2020, 2:20 PM IST

కరోనా మహామ్మారి ఎంతో మంది జీవితలను చిన్నాభిన్నం చేసింది. వైరస్‌ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించడంతో వలస జీవులు ఉపాధి కోల్పోయారు. వలస కూలీల ఆకలి కేకలు చూసిన చల్లామారెడ్డి వారికి అన్న పెట్టాలని సంకల్పించాడు. ప్రతి రోజు వారికి అన్నం, పండ్లు, బటర్‌ మిల్క్‌ అందించడం చూసి కొందరు మిత్రులు ఆర్థికంగా సహాయం చేశారు. వారి ప్రోత్సాహంతో మరింత ఉత్సహంగా మణికొండ, మాదాపూర్‌, మియాపూర్‌, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 600 నుంచి 800 మందికి అన్నదానం చేశారు.

ఆ ఆవేదనతోనే....

చిన్నతనంలో ఆకలి తీర్చేందుకు తన తల్లిదండ్రులు పడిన ఆవేదన, ఆరాటం ఇప్పటికీ గుర్తున్నాయని అంటున్నారు చలమారెడ్డి. అందుకే ఎవరైనా ఆకలితో ఉంటే వారికి అన్నం పెట్టాలనే అలోచన వస్తుందని చెబుతున్నాడు. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి నేటి వరకు మణికొండ చుట్టు పక్కల ఉన్న కాలనీలోని వలస కార్మికులు అన్నదానం చేసినట్లు ఆయన తెలిపారు. మొదట ఒక్కడే ప్రారంభించానని...ఆ తరువాత మిత్రులు, కాలనీ వాసుల సహాయంతో దాదాపు వేల మందికి అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఇందులో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, పని వారి సహాయంతో ఇది సాధ్యమైందన్నారు.

విపత్కర పరిస్థితిలో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని చలమారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సేవలను మేయర్ బొంతురామ్మోహన్‌‌ చలమారెడ్డిని అభినందించారు.

ఇదీ చూడండి.. స్క్రిప్ట్​ రెడీ.. షూటింగ్​ చేయడమే ఆలస్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.