నాడు తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి, నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా నిలిచిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఐదో వర్ధంతి వేడుకలు హైదరాబాద్లో నిర్వహించారు. సీపీఎం నాయకులు... లోయర్ ట్యాంక్బండ వద్దనున్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
తెలంగాణలో ఆమె చేసిన పోరాటానికి భూస్వాములు పల్లెలు వదిలి పట్టణాలకు పరుగులు తీశారని... నెహ్రూ సైన్యం వచ్చి ఆమె సేవలను కొనియాడారని ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య పేర్కొన్నారు.