ETV Bharat / state

ఇల్లు అద్దెకు కావాలని వస్తారు... కాజేస్తారు - చైన్​స్నాచర్స్​ అరెస్ట్​

అద్దెకు ఇల్లు కావాలని వెళ్లారు.. చుట్టూ పరిసరాలను గమనించారు. ఒంటరిగా ఓ వృద్ధురాలు కనిపించింది. అంతే పక్కా ప్లాన్​ ప్రకారం పుస్తలెతాడు కాజేశారు. హమయ్య కొన్నిరోజులు జల్సా చేయొచ్చని భావించారు.. కానీ సీన్​ రివర్స్​ అయ్యి.. కటకటాల పాలయ్యారు.

Chain Snatcher Arrest in Hyderabad
జల్సాలకు అలవాటుపడిన దొంగ జంట
author img

By

Published : Jan 23, 2020, 12:58 PM IST

దొంగతనం చేసిన బంగారు గొలుసు అమ్ముతూ హైదరాబాద్​ తిరుమలగిరి పోలీసులకు వడ్లూరి విజయలక్ష్మి, సాయికిరణ్​ దంపతులు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి ఐదుతులాల పుస్తెలతాడు.. ఒక ద్విచక్రవాహనం, రెండు చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం

సికింద్రాబాద్​ పరిధిలోని టీచర్స్​కాలనీలో వడ్లూరి సాయికిరణ్​ దంపతులు కిరాయికి ఉంటున్నారు. ఈనెల 14వ తేదీన అదే కాలనీలో ఉంటున్న భ్రమరాంబ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి రూమ్​ అద్దెకు ఉందా అని విజయలక్ష్మి అడిగింది. ఇక్కడేమీ కిరాయికి లేవని ఆమె సమాధానమిచ్చింది. కొద్దిసేపటికి పక్కా ప్లాన్​ ప్రకారం భ్రమరాంభ ఇంటి తలుపు తట్టి ఆమె తలుపుతీయగానే మెడలోని పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని బైక్​పై వీరు పారిపోయారు. దీనితో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.

అయితే 22వ తేదీ చిలకలగూడ సమీపంలోని ఓ దుకాణంలో ఆ జంట గొలుసును అమ్ముతుండగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసినందుకు బేగంపేట ఏసీపీ శ్రీ నరేశ్​రెడ్డి క్రైమ్​ సిబ్బందిని అభినందించారు.

జల్సాలకు అలవాటుపడిన దొంగ జంట

ఇవీ చూడండి: మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

Intro:గొలుసు దొంగతనం కేసు లొ భార్యాభర్తలను అరెస్టు చేసిన తిరుమలగిరి పోలీసులు...

ఈనెల 14వ తారీఖున టీచర్స్ కాలనీ తిరుమలగిరి లో మధ్యాహ్న సమయంలో భ్రమరాంబ వృద్ధురాలు తన ఇంట్లో ఉండగా, ఒక గుర్తు తెలియని మహిళ ఇల్లు కిరాయికి ఉన్నదా అని అడిగినది, అందుకు వృద్ధ మహిళ ఇక్కడ కిరాయికి ఏమీ లేవని తెలియజేసింది ఆ తర్వాత కొద్ది సేపటికి ఇలా వచ్చి బుద్ధ 5 తులాల పుస్తెలతాడు ని బలవంతంగా తీసుకొని అప్పటికే సిద్ధంగా ఉన్నా ఒక బైక్ పై గుర్తుతెలియని వ్యక్తి తో కలిసి డైరీ ఫాం రోడ్డు మీదుగా పారిపోయారు.. దానిపై తిరుమలగిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.

ఈరోజు మధ్యాహ్న సమయంలో ఆ వ్యక్తులు... అనగా వడ్లూరు విజయలక్ష్మి వయస్సు 29 సంవత్సరాలు ఆమె భర్త వడ్లూరు సాయికిరణ్ వయస్సు 29 సంవత్సరాలు మార్కెటింగ్ నివాసం కవాడిగూడ, సికింద్రాబాద్ గత ఐదు నెలల నుంచి ఇదే టీచర్స్ కాలనీలో కిరాయికి ఉంటున్నారు వారు లాల్ బజార్ లో బంగారం షాప్ దగ్గర చోరీ సొత్తును అమ్మటానికి ప్రయత్నించగా పోలీసువారికి నమ్మదగిన సమాచారం వచ్చింది ఆ ప్రకారం తిరుమలగిరి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని 5 తులాల బంగారు గొలుసును మరియు నేరంలో ఉపయోగించిన పల్సర్ బైక్( ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు) వారి యొక్క రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. జల్సాలకు అలవాటు పడి ఈ నేరాన్ని చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

సాయి కిరణ్ 2012 లో చిలకలగూడ ఒక వ్యక్తిని నుండి బలవంతంగా డబ్బు గుంజుకున్న కేసులో సహా నేరస్తుడు...

ఈ కేసుని తొందరగా చేదించి చోరీ సొత్తు ని రికవరీ చేసినందుకు ఏసీపీ బేగంపేట్ శ్రీ నరేష్ రెడ్డి గారు తిరుమలగిరి ఇన్స్పెక్టర్ కే రవి కుమార్ ని ఎస్సై వెంకటేశ్వర్లు మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించడం జరిగింది.Body:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.