ETV Bharat / state

'చిన్నారిని చిత్రహింసలు పెట్టిన కేసు దర్యాప్తు వేగవంతం'

హైదరాబాద్ చాదర్​ఘాట్​లోని వాహీద్​నగర్​లో చిన్నారి చేత వెట్టి చేయిస్తూ చిత్ర హింసలు పెట్టిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. ఇంకా ఎంతమంది చిన్నారులతో ఇదే తరహా పనులు చేయించారోనని విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

'ఇలా ఎంత మంది చిన్నారులను తరలించారో.. విచారిస్తున్నాం'

author img

By

Published : Jun 14, 2020, 5:40 PM IST

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌ పరిధిలోని వాహీద్​నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్‌కుమార్‌ వెల్లడించారు. బాధిత చిన్నారిని ఎవరు, ఎక్కడ్నుంచి నిందితురాలికి అప్పగించారు. ఇలా ఇంకెంత మందిని తీసుకువచ్చారనే కోణంలో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

'ఇలా ఎంత మంది చిన్నారులను తరలించారో.. విచారిస్తున్నాం'

వెట్టి చాకిరీ చేయించేది...

చిన్నారిని ఓ వైద్యుడు తీసుకువచ్చి నిందితురాలికి అప్పగించినట్లు తెలుస్తుందని సీఐ వివరించారు. చిన్నారికి సరిగ్గా తిండిపెట్టకుండా.. వెట్టి చాకిరీ చేయిస్తూ వేధింపులకు గురిచేస్తుండేదన్నారు. చిన్నారి చెప్పిన మాట వినకపోతే అమె ఒంటిపై వాతలు పెడుతూ కొట్టేదని సతీశ్ స్పష్టం చేశారు. మహిళ ఆగడాలను పసిగట్టిన స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సదరు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సతీష్ కుమార్ వెల్లడించారు.

ఇవీ చూడండి : మాపై దాడులను అరికట్టండి.. ఈటలతో వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.