హైదరాబాద్ మఖ్ధూం భవన్‌లో శనివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశ తీర్మానాలను వెంకట్‌రెడ్డి వివరించారు. పోడు భూములు, భూప్రక్షానలో చోటుచేసుకుంటున్న లోపాలపై స్థానికులతో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో సీపీఐ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపడతామన్నారు. ప్రధానంగా ప్రాణహిత, తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన కోసం ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు.
ఇదీ చదవండి: సాయంత్రం సీపీఐ... రాత్రి తెరాస...