ETV Bharat / state

'నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది వేతనాలు పెంచాలి' - నెల వేతనం రూ.25వేలకు పెంచాలి

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి నెల వేతనం రూ.25వేలకు పెంచాలని కోరారు.

chada venkat reddy demand nursing and paramedical staff salaries should be increased
'నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది వేతనాలు పెంచాలి'
author img

By

Published : Jul 11, 2020, 9:57 PM IST

రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఫీవర్ తదితర ప్రధాన ఆసుపత్రుల్లో వారు పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా ఆసుపత్రుల్లో నెలకు రూ.17,500 వేతనంపై వేలాది మంది పారామెడికల్ సిబ్బంది గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వారి బతుకులు అగమ్య గోచరంగా మారాయన్నారు.

గత మార్చి నెల నుంచి కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేస్తున్న సిబ్బందికి నెలకు రూ.25 వేలు ఇవ్వాలని చాడ కోరారు. సమాన పనికి సమానం వేతన చట్టం ప్రకారం వేతనం పెంచుతూ మార్చి నెల నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : అప్పుడు పెళ్లికి ముందు వెళ్లిపోయింది.. ఇప్పుడు ఆస్తి కోసం గొడవకు దిగింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.