భాజపా రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్‌దయాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత విద్యాసాగర్ రావు దీన్‌దయాల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండే రోజుల్లో వాటికి ప్రత్యామ్నాయంగా 'ఏకాత్మ మానవతా వాదం' సిద్ధాతం ఆయన ప్రతిపాదించారని వెల్లడించారు. దీన్‌దయాల్ పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా తనను తాను సమాజానికి సమర్పించుకున్నరని వెల్లడించారు.
ఇవీచూడండి: హైదరాబాద్‌వాసులకు తప్పని వాన తిప్పలు